Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం..
తెలంగాణ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటి క్రితమే.. (Telangana) తెలంగాణ గవర్నర్ (Governor) తమిళి సై సౌందర్ రాజన్ (Tamil Sai Soundar Rajan) అసెంబ్లీ చేరుకున్నారు. కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగింస్తున్నారు.

Telangana Assembly Meetings..Governor's Speech Addressing Both Houses..
తెలంగాణ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటి క్రితమే.. (Telangana) తెలంగాణ గవర్నర్ (Governor) తమిళి సై సౌందర్ రాజన్ (Tamil Sai Soundar Rajan) అసెంబ్లీ చేరుకున్నారు. కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగింస్తున్నారు. రేపు గవర్నర్ కు ధన్యవాద తీర్నానం చేయనున్నారు. పదో తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.
అసెంబ్లీ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుతో పాటు కులగణన బిల్లు, ఉద్యోగాల నియామకాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.