Telangana Assembly : నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, శ్వేతపత్రంపైనా చర్చలు..

ఈసారి మూడో శాసన సభలోకి కొత్తగా 57 మంది ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు.. రన్నింగ్ కామెంట్స్ చేయకండి అన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులు .. కొత్త వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. శాసన సభలో అందరూ మాట్లాడే మాటలు ప్రజలందరికి ఆదర్శప్రాయంగా కావాలని కోరారు సభ పతి గడ్డ ప్రసాద్ కుమార్. అనంతరం ముందుగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడాలని స్పీకర్ కోరారు. నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 11:47 AMLast Updated on: Dec 20, 2023 | 11:47 AM

Telangana Assembly Started After A Four Day Break Discussions On The Economic Condition Of The State And The White Paper

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతిపట్ల శాసనసభ సంతాపన్ని తెలియజేసింది. ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. వారి కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. సభ పతి శాసన శాభ సభ్యలుకు ఓ విప్ఞప్తి చేశారు. ఎవరు ఎవరికి కించపరిచినట్లు మాట్లాడకూడదని కోరారు. శాసన సభలో అందరూ ఒకరినొకరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలని కోరారు. సభను మరింత హుందాగా నడపాలని కోరారు.

ఈసారి మూడో శాసన సభలోకి కొత్తగా 57 మంది ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు.. రన్నింగ్ కామెంట్స్ చేయకండి అన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులు .. కొత్త వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. శాసన సభలో అందరూ మాట్లాడే మాటలు ప్రజలందరికి ఆదర్శప్రాయంగా కావాలని కోరారు సభ పతి గడ్డ ప్రసాద్ కుమార్. అనంతరం ముందుగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడాలని స్పీకర్ కోరారు. నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, శ్వేతపత్రం పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లఘు చర్చ మొదలు పెట్టారు. కాగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైనా, శ్వేతపత్రంపైనా చర్చ జరిపేందుకు తమకు కొంచము సమయం కేటాయించాలని.. మాజీ మంత్రి ప్రతిపక్ష నేత హరీష్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, కూనంనేని సాంబ శివ స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో స్పీకర్ ద్వారా సభ సభ్యులకు 30 నిమిషాల పాటు టీ బ్రేక్ ప్రటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అనంతరం తిరిగి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, శ్వేతపత్రం పై లఘు చర్చ జరగనుంది.