BJP Telangana: తెలంగాణలోనూ కర్ణాటక తప్పే చేస్తోందా.. బీజేపీ మళ్లీ బొక్కాబోర్లా పడడం ఖాయమా ?
హిందుత్వ నినాదంతో ఉత్తర భారతదేశంలో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది ప్రతీ ఎన్నికల్లో ! దేశమంతా ఇదే నినాదంతో అధికారంలోకి రావాలని వ్యూహాలు రచించింది. కర్ణాటకలో అదే ఫాలో అయింది కూడా! ఐతే సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అయింది.
ఘోరా పరభావం మూటగట్టుకుంది. కర్ణాటక విజయంతో దక్షిణాదిలో దున్నేయాలని వ్యూహాలు రచించిన కమలం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. నిజానికి ఉత్తరాది రాజకీయాలకు, సదరన్ పాలిటిక్స్‌కు చాలా తేడా ఉంటుంది. మతం అనే ఫ్యాక్టర్ నార్త్ పాలిటిక్స్‌లో కీ రోల్ ప్లే చేస్తే.. దక్షిణాదిలో మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఎక్కువగా ! అది కులం కావొచ్చు.. ప్రాంతం సెంటిమెంట్ కావొచ్చు.. ఏదైనా సరే.. సెంటిమెంటే దక్షిణాది రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
అది తెలుసుకోలేదో.. తెలుసుకున్నా వద్దు అనుకుందో కానీ.. హిందుత్వ అజెండా అనే అంశాన్నే ఎక్కువగా నమ్ముకుంది బీజేపీ. కర్ణాటకలో ఫలితం తేడా కొట్టడం వెనక భారీ మిస్టేక్ అదే. కర్ణాటక తర్వాత బీజేపీ ఆశలు పెంచుకున్న రాష్ట్రం తెలంగాణే ! కర్ణాటక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. ఇక్కడ మళ్లీ తప్పులు జరగకుండా చూస్తుందా అంటే.. బీజేపీ మాత్రం పాత రూట్‌లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. హిందుత్వ నినాదంతోనే తెలంగాణ ఎన్నికల్లోకి వెళ్లాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హిందుత్వ ఏక్తా యాత్రలు అంటూ మొదలుపెట్టిన కమలం పార్టీ.. తమ లక్ష్యం ఏంటో, నినాదం ఏంటో చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఏకంగా బజరంగ్‌దళ్ వ్యవహారాన్ని కూడా తెరమీదకు తీసుకువస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని.. తెలంగాణకు ఆపాదిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయ్. కాంగ్రెస్ అండతో.. బజరంగ్‌దళ్‌ని నిషేధించడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం వ్యక్తిగతంగా తప్పు అయినా.. రాజకీయంగా కానే కాదు. జాతీయ పార్టీ అయినా.. ప్రాంతీయ సెంటిమెంట్లకు పెద్ద పీట వేయాలి. దేశమంతా ఒకే నినాదం అంటే అంతగా సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు ఈ సమయంలో. ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాల్సింది, మారాల్సింది ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.