Telangana BJP : తెలంగాణ బీజేపీ తుది జాబితా విడుదల.. 14 మంది అభ్యర్ధులు ఫైనల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులు ముందుగానే ప్రకటించారు. ఇక అధికార పార్టీ అయితే ఒకేసారి 119 పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో బుల్లెట్ ట్రైన్ స్పీట్ లో దూసుకపోతుంది. కాంగ్రెస్ పార్టీ 118 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక స్థానం కేటాయించింది.

Telangana BJP final list released.. 14 candidates final
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులు ముందుగానే ప్రకటించారు. ఇక అధికార పార్టీ అయితే ఒకేసారి 119 పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో బుల్లెట్ ట్రైన్ స్పీట్ లో దూసుకపోతుంది. కాంగ్రెస్ పార్టీ 118 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక స్థానం కేటాయించింది. మరో వైపు భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో జనసేనతో పొత్తులో భాగంగా 8 స్థానాలు జనసేనకు కేటాయించింది. ఈ స్థానాలతో పాటు మరో 3 చోట్ల అభ్యర్థులను మార్చి ( వనపర్తి.. చంద్రాయణగుట్ట.. బెల్లంపల్లి ) ..మొత్తం 14 స్థానాలతో బీజేపీ తుది జాబితాను విడుదల చేసింది.
ఇక నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియడంతో మధ్యాహ్నం లోపు అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశించారు.
బీజేపీ ఫైనల్ లిస్ట్ అభ్యర్థులు..
- కంటోన్మెంట్ – గణేష్ నారాయణ్
- దేవరకద్ర – కొండా ప్రశాంత్ రెడ్డి
- వనపర్తి – అనుఘ్నారెడ్డి
- అలంపూర్ – మేరమ్మ
- నర్సంపేట – కే. పుల్లారావు
- మధిర – విజయరాజు
- నాంపల్లి-రాహుల్ చంద్ర
- మల్కాజ్‌గిరి – రామచంద్రరావు
- శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్
- పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్
- బెల్లంపల్లి – ఎమాజీ
- సంగారెడ్డి – దేశ్‌పాండే రాజేశ్వరరావు
- మేడ్చల్ – సుదర్శన్ రెడ్డి
- చాంద్రాయణ గుట్ట- మహేందర్