Telangana, Cabinet Meeting : 18న తెలంగాణ కేబినెట్ సమావేశం! రెండు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చ..
ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పాలనపై దృష్టి పెడుతున్నారు. ఇవే అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, బుధవారం సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జూన్ 2 నాటికి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న విభజన అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 నాటికీ స్వాధీనం చేసుకోవాలని, ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలనీ.. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.