Telangana cabinet meeting : నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరపనున్న శాసన సభ్యులు
తెలంగాణలో మూడో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఒవైసీ మిగతా సభ్యులతో ప్రమాణం చేయనున్నారు. నేడు ఎమ్మెల్యేలుగా కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణలో మూడో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఒవైసీ మిగతా సభ్యులతో ప్రమాణం చేయనున్నారు. నేడు ఎమ్మెల్యేలుగా కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ఆ తర్వాత ఉదయం 11.30 కి అసెంబ్లీలో క్యాబినెట్ భేటీ జరగనుంది. స్పీకర్ ఎన్నిక ముగిసిన తర్వాత క్యాబినెట్.. రాష్ట్ర గవర్నర్ ప్రసంగంపై క్యాబినెట్ లో చర్చ జరగనుంది. కాగా అసెంబ్లీ వర్గాల సమాచారం మేరకు ఈనెల 15వ తేదిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ, మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నికునే అవకాశ ఉంది. అనంతరం ఆయనతో ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని మంత్రి మండలి ఆమోదించనుంది. కాగా, మరో ఆరుగురు మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మరో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగాన్ని స్పీకర్ శుక్రవారం ప్రకటించనున్నారు. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగే అవకాశం ఉందని శాసనసభ వర్గాలు తెలిపాయి. స్పీకర్ ఎన్నిక దృష్ట్యా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది.