CM Revanth Reddy : 10 రోజుల అమెరికా పర్యటనలో.. సీఎం రేవంత్..
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికాకు బయలుదేరారు.

Telangana Chief Minister Revanth Reddy went on a foreign tour.
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికాకు బయలుదేరారు. ఆయన వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu), సీఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు ఉన్నారు. ఈనెల ఆగస్టు 06 న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది రేవంత్ టీమ్ వెల్లడించింది. 10 రోజుల పర్యటనలో భాగంగా పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. అక్కడి నుంచి రెండు రోజుల పర్యటనకు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. అనంతరం విదేశీ పర్యటన ముగించుకోని.. ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు.