Telangana Cabinet : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రి వర్గ విస్తరణపై తుది నిర్ణయం

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లికి వెళ్లనున్నారు. తెలంగాణలో మంత్ర వర్గ విస్తరణపై జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన నేడు సమావేశం కానున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 3, 2024 | 10:45 AMLast Updated on: Jul 03, 2024 | 10:45 AM

Telangana Chief Minister Revanth Reddy Will Go To Delhi Today

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లికి వెళ్లనున్నారు. తెలంగాణలో మంత్ర వర్గ విస్తరణపై జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన నేడు సమావేశం కానున్నారు. కాగా ఇప్పటికే కేబినెల్ లో సీఎం సహా 12 మంది మంత్రులుగా ఉన్నారు. మరో 6 సీట్లు ఖాళీగా ఉండటంతో మంత్రవర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిచ్చయించింది. కాగా ఈ ఆరు మంత్రి పదవులు ఏవరిని వరిస్తోయో చూడాలి. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.

ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ లో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ మంత్రివర్గ విస్తరణ లో ఈ 4 జిల్లాల్లో తప్పనిసరిగా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని సమాచారం.. ఇక మరోవైపు ములుగు జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్కకు.. ప్రస్తుతం ఉన్న పదవి నుంచి తప్పించి రాష్ట్ర హోం శాఖ ఇవ్వాలని వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సీనియర్ నేతల్లో మంత్రి పదవులు ఇస్తారనే వార్తలు కూడావినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం ఇస్తామని నేరుగా ఇంటికి వెళ్లి మరి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో మంత్రి వర్గంలో పోచారంకు చోటు దక్కుతుంది అని అందరు అనుకుంటున్నారు. ఇక మరో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ కు కూడా మంత్రివర్గంలో చోటు ఉంటుందని స్పష్టమైవుతోంది.