Telangana Chief Minister Revanth Reddy : రేవంత్ రెడ్డి.. జడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా..
మాస్ లీడర్ గా.. ప్రత్యర్థి పార్టీల లీడర్లను.. తన మాటలతో దాడి చేసే దూకుడున్న లీడర్ రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలకు చేపట్టాకా.. అగ్రెసివ్ గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. సీఎం కేసీఆర్ ను అధికారం నుంచి దింపుతామని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. మాకూ ఓ ఛాన్స్ ఇవ్వండి అంటూ రేవంత్ చేసిన విజ్ఞప్తితో జనం కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

Telangana Chief Minister Revanth Reddy's political career from ZPTC to CM's chair.
అనుకో స్వామీ అయిపోతావ్.. అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా అనుకున్నారు.. అనుకున్నట్టే అయ్యారు. తెలంగాణలో పదేళ్ళుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చారు ఎనుముల రేవంత్ రెడ్డి. అందుకే ముఖ్యమంత్రి పీఠం ఆయనకే దక్కింది. రెండు దశాబ్దాలుగా అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఫైర్ రగిల్చి.. అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ దే కీలకపాత్ర. అందుకే ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.
మాస్ లీడర్ గా.. ప్రత్యర్థి పార్టీల లీడర్లను.. తన మాటలతో దాడి చేసే దూకుడున్న లీడర్ రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలకు చేపట్టాకా.. అగ్రెసివ్ గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. సీఎం కేసీఆర్ ను అధికారం నుంచి దింపుతామని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. మాకూ ఓ ఛాన్స్ ఇవ్వండి అంటూ రేవంత్ చేసిన విజ్ఞప్తితో జనం కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు రేవంత్ రెడ్డి .. గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడే ABVP లీడర్ గా ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను 1992లో పెళ్ళి చేసుకున్నారు. తర్వాత 2004లో తెలుగు దేశం పార్టీలో చేరి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి పోటీ చేయడానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించడంతో.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 2008లో శాసనమండలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యారు. 2008లో మళ్ళీ టీడీపీలో చేరిన రేవంత్.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లోనూ అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై రెండోసారి గెలిచారు. టీడీపీ ఎల్పీ నేతగా కూడా వ్యవహరించారు.
2017లో టీడీపీలో నేతలతో వచ్చిన విభేదాలతో ఆ పార్టీని వీడి రెండు నెలల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2018లో మొదట కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో ఒకరిగా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రేవంత్. తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా AICC నియమించింది. సీనియర్లు, జూనియర్లను కలుపుకుపోయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.