D Srinivas funeral : నేడు డీఎస్ అంత్యక్రియలు.. పాల్గొననున్న సీఎం
నిన్న గుండెపోటుతో కన్నుమూసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

Telangana Congress senior leader former MP and PCC president D. Srinivas' funeral will be held today.
నిన్న గుండెపోటుతో కన్నుమూసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నిజామాబాద్ లో డీఎస్ పార్థీవదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మధ్యాహ్నం నిజామాబాద్ లోని డీఎస్ నివాసం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లారు. డీఎస్ పార్థివదేహానికి నివాళి అర్పించారు. సీఎంతో పాటుగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం డీఎస్ శ్రీనివాస్ మీదా.. కాంగ్రెస్ పార్టీ జెండా కప్పారు.