బ్రేకింగ్: రేవంత్ కోర్ట్ కు రావాల్సిందే, కోర్ట్ ఆదేశాలు
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ జరిగింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ జరిగింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు అయ్యారు. నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ సహా నిందితులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.