Telangana Foundation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతే విధంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. కాగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు లెక్కడ చేయకుండా ప్రాణత్యగం చేసిన వారిని స్మరించుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతే విధంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. కాగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు లెక్కడ చేయకుండా ప్రాణత్యగం చేసిన వారిని స్మరించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ మంత్రి వర్గం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.
ఇక అక్కడి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం కాంగ్రెస్ జాతీయ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం శుభాక్షాంకాలు తెలిపిన వీడియో సందేశాని వినిపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
- జై తెలంగాణ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించారు.
”4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది.. తెలంగాణ అస్తిత్వానికి .. ఆత్మగౌరవానికి
పట్టాభిషేకం జరిగిన.. దశాబ్దకాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నా నివాళి
6 దశాబ్దాల కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారికి.. నాటి యూపీఏ చైర్ పర్సన్ కు తెలంగాణ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, – సీఎం రేవంత్ రెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం…
ఆకలినైనా భరిస్తాం.. స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమన్నారు. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరుముతామన్నారు. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమ మాకు లేదన్న రేవంత్ రెడ్డి, పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందన్నారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లి సోనియాకు హోదా అవసరమా? తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి పునర్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఇప్పటి వరకు రాష్ట్ర గేయం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వవమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని స్పష్టం చేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ విడుదల చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమై అంశాలు..
- పరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
- పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ అధికారులు..
- వేడుకలకు అమరుల కుటుంబ సభ్యులను పిలిచిన ప్రభుత్వం..
- పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు..
- పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు..
- నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
- పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించారు.
- రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి.
- చిహ్నం ఓ జాతి చరిత్రకు అద్దం పడుతుంది.
- రాష్ట్ర అధికారిక చిహ్నన్ని రూపొందించే పనిలో ఉన్నాం..
- ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాం..
- ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చాం..
- ఆరోగ్యశ్రీని వైఎస్సార్ తరహాలో అమలు చేస్తాం..
- తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది..
- పాలనను ప్రజల వద్దకు తెచ్చాం..
- మన సంస్కృతి, చరిత్ర గొప్పది..
- ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం..
- తల్లిని ఆహ్వానించేందుకు అనుమతి కావాలా..
- తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా, మన్మోహన క్కు కృతజ్ఞతలు..
- ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది..
- బానిసత్వాన్ని తెలంగాణ భరించదు..
- ముళ్ల కంచెలు, ఇనుప గోడలను తొలగించాం..
- సచివాలయానికి సామాన్యుడు వచ్చేలా చేశాం..
- గత పదేళ్లలో స్వేచ్ఛపై దాడి జరిగింది..
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి..
- తెలంగాణ వచ్చి పదేళ్ల అయినా ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేదు..
తెలంగాణకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు..
- తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ..
- తెలంగాణ అమరవీరులకు నివాళులు..
- పదేళ్ల కిందట మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ కల నిజమైంది..
- ప్రజా తెలంగాణ సాధనకు కట్టుబడి ఉన్నాం..
- అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత సాధించడమే లక్ష్యం..
సోనియా గాంధీ వీడియో సందేశం
- రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా సందేశం..
- సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేసిన ప్రభుత్వం..
- తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత రాష్ట్రం తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది..
- తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చడం తక్షణ కర్తవ్యం..
- తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో వెనుకడుగు వేయదు..