Six Guarantees : తెలంగాణ ఆడబిడ్డలు రేవంత్ గుడ్‌న్యూస్.. తులం బంగారం, రూ. లక్ష అప్పటి నుంచే..
తెలంగాణలో (Telangana) అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే రెండు పథకాలను మొదలుపెట్టిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు మిగిలిన స్కీమ్‌ల మీద దృష్టిసారించింది.
తెలంగాణలో (Telangana) అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే రెండు పథకాలను మొదలుపెట్టిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు మిగిలిన స్కీమ్‌ల మీద దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలలోపే కీలక పథకాలు మొదలుపెట్టాలని ఫిక్స్ అయింది. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని పెంచారు. ఈ రెండు గ్యారంటీలు అమల్లో ఉన్నాయి. 6 గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ చాలాసార్లు చెప్పారు.
ఇప్పుడు మిగతా 4 గ్యారంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు లక్షతోపాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. దీంతో పాటు అభివృద్ధి పనులపైనా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విద్యారంగంపైనా దృష్టిపెట్టారు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ (Green Channel) ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గురుకుల పాఠశాలలకు (Gurukula schools) సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని చెప్పారు. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఐతే ఈ తులం బంగారం, లక్ష రూపాయలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.