Kalki 2898AD : ‘కల్కి’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ ఎంతంటే..?
ఇండియాన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ అని అందరికి తెలిసిందే.. ఈ చిత్రం మరో 4 రోజుల్లో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Telangana government gives green signal to increase ticket prices of 'Kalki'.. How much is one ticket..?
ఇండియాన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ అని అందరికి తెలిసిందే.. ఈ చిత్రం మరో 4 రోజుల్లో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీకి ఓ శుభవార్త అందించింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898AD’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో కల్కి సినిమా స్పెషల్ షోల టిక్కెట్ రేట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున ధరలు పెరగనున్నాయి. రిలీజయ్యే జూన్ 27న ఉదయం 5.30 బెనిఫిట్ షోకు రూ.200 పెంపు అదనంగా ఉండనుంది. జులై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది.
బెనిఫిట్ షోల రేట్లు
సింగిల్ స్క్రీన్ థియేటర్లు – 377/-
మల్టీప్లెక్స్ – 495/-
రెగ్యులర్ షోల రేట్లు
సింగిల్ స్క్రీన్ థియేటర్ – 265/-
మల్టీప్లెక్స్ – 413/-