TSPSC Group 1: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 60 గ్రూప్-1 పోస్టులకు ఆమోదం
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొత్త పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలవుతుందా..? లేక పాత నోటిఫికేషన్ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రావొచ్చు.
TSPSC Group 1: తెలంగాణలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్‌కు అదనంగా మరో 60 గ్రూప్-1 పోస్టుల్ని భర్తీ చేస్తారు. గతంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తూ, టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 563కు చేరనుంది.
REVANTH REDDY VS KCR: దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్
అయితే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొత్త పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలవుతుందా..? లేక పాత నోటిఫికేషన్ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రావొచ్చు. అయితే, కొత్త నోటిఫికేషన్, మళ్లీ దరఖాస్తు అంటే అభ్యర్థులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, 2,80,000 మంది హాజరయ్యారు. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈ పరీక్ష రద్దయ్యింది. మళ్లీ 2023 జూన్‌లో ప్రిలిమ్స్ నిర్వహించారు.
అయితే, పరీక్ష నిర్వహణలో లోపాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ పరీక్షలను రద్దు చేసింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పాత టీఎస్‌పీఎస్‌సీ బోర్డును రద్దు చేసింది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించి, కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మరో 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో, మొత్తం 563 పోస్టులకు త్వరలో పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష షెడ్యూల్ విడుదలవ్వాల్సి ఉంది.