TS DSC Notification: 11062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
గత ప్రభుత్వం 5,089 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా.. రేవంత్ సర్కార్ అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి.. మొత్తం 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
TS DSC Notification: తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 11062 పోస్టులతో ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి.. మెగా డిఎస్సీ 2024 నోటిపికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాత నోటిఫికేషన్‌ను రేవంత్ సర్కార్ గురువారం రద్దు చేసింది.
TDP-Janasena : పవన్ పంచ్ తో సైడ్ అయిన.. హరి రామ, ముద్రగడ
ఆ మరుసటి రోజే.. అంటే గురువారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా.. రేవంత్ సర్కార్ అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి.. మొత్తం 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 6,508, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, పీఈటీ పోస్టులు 182, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం పెంచిన గరిష్ట వయోపరిమితికి అనుగుణంగా 46 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలుగా ఉంది.
అయితే, పరీక్షల తేదీని ఇంకా ప్రకటించలేదు. మే నెలలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. మొత్తం పది రోజులపాటు పరీక్షలు జరుగుతాయి. మరోవైపు గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని వెల్లడించింది. గతేడాది విడుదల చేసిన డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా.. ఈ సారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.