Barrelakka: బర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం..
తనకు భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్నె శిరీష వేసిన హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది.
Barrelakka: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష్. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. పలువురి మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఇటీవల దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే తనకు భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్నె శిరీష వేసిన హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది.
BANDI SANJAY: బీసీ మంత్రి అయినా బీసీ బంధు ఇప్పించలేదు.. గంగులపై బండి సంజయ్ ఫైర్
ఈ సందర్భంగా బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు రక్షణ కల్పించాలని.. ఆమె నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు ఒక గన్‌మెన్‌తో భద్రత ఇవ్వాలని పోలీస్ శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో కేవలం గుర్తింపు ఉన్న పార్టీల నాయకులకు మాత్రమే భద్రత ఇస్తేనే సరిపోదని.. ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ కల్పించాలని ఆదేశించింది. అభ్యర్థుల భద్రత, బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అభ్యర్థుల భద్రతపై డీజీపీ, ఈసీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మూడు రోజుల క్రితం బర్రెలక్క కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె సోదరుడిపై దుండగులు దాడి చేశారు. ఈ విషయంలో బర్రెలక్క పోలీసుల్ని ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన రాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తనకు 2+2 భద్రత కల్పించాలని కోర్టును కోరింది.