YS JAGAN: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..
జగన్ అక్రమాస్తుల కేసుపై ఏపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరపనుంది.

YS JAGAN: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS JAGAN)కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో జగన్‌కు తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) బుధవారం నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుపై ఏపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Harirama Jogaiah) పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరపనుంది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరుపుతుంది.
PAWAN KALYAN: పంచుల్లేని పవన్ ప్రసంగం.. బీజేపీ సభలో అంటీ ముట్టనట్టు..!
జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.ఈ కేసును ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. హరి రామ జోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రతివాదులు జగన్, సీబీఐ (CBI), సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు.