Telangana High Court: కోదండరాంకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు రేవంత్ ఏం చేయబోతున్నారు.?
ఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని హైకోర్టు కొట్టేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

Telangana High Court: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వ గెజిట్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని హైకోర్టు కొట్టేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.
Bengaluru water crisis: బెంగళూరులో నీటి కటకట.. వాటర్ ట్యాంకర్లే దిక్కు..
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హయాంలో.. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది. ఐతే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి ఆమోద ముద్ర వేయలేదు. ఈ ఇద్దరూ రాజకీయ నేతలేనని.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించకూడదనే నిబంధనలు ఉన్నాయని క్లియర్‌గా చెప్పేశారు గవర్నర్. ఐతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆ ఇద్దరి స్థానంలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఐతే గత ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వానికి తమను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే హక్కు ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. దీంతో తుది ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయొద్దని కోదండరాంను, అమీర్ అలీ ఖాన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ణు హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్ వచ్చాక మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్‌కు అభ్యర్థుల పేర్లను పంపాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో గవర్నర్ తమిళిసై.. మళ్లీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అభ్యర్థులను సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు అభ్యర్థులకు గవర్నర్ ఆమోద్ర ముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయబోతోందని తెలుస్తోంది.