Telangana IAS: కట్టుకున్న భార్యనే బలవంతానికి పాల్పడుతున్నాడు.. వీడు ఐఏఎస్ కాదు.. శాడిస్ట్
శృంగారం అనేది సహజమైన చర్య. ఇది ఒకరు బలవంతపెడితేనో, మరొకరు ప్రేరేపిస్తేనో కలిగే భావన కాదు. అడవిలో నివసించే జంతువుల నుంచి జనావాసాల్లో నివసించే సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని తమ జీవితంతో అనుభవించక తప్పదు. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా ఈ భావనకు అయితే గురౌతారు. అలా కాలేదంటే అదేదో శారీరక లోపం ఉన్నట్లు అర్థం. అయితే ఇక్కడ చదువుకున్న వారు చదువు రాని వారు అనే విచక్షణను మరిచి అసహజ శృంగార వాంఛను తీర్చుకునే అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. అది కూడా భారత అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీస్ అందించే ఐఏఎస్ ఆఫీసర్. ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

FIR File on Sandeep Kumar IAS
ఇతని పేరు సందీప్ కుమార్ ఝా. తెలుగురాష్ట్రాల్లోని తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2014 బ్యాచ్ కు చెందిన వారు. తాజాగా ఛత్తీస్గఢ్ లోని కోర్భా న్యాయస్థానం ఇతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి గల ప్రధాన కారణం తన సతీమణి చేసిన ఆరోపణలు అని చెప్పాలి. ఇలా స్వయంగా కట్టుకున్న భర్తని కోర్డుకు ఈడ్చాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. అతను చేసిన తప్పేంటి.. అని అందరికీ సందేహం కలుగవచ్చు. దీనికి సమాధానం తెలియాలంటే వీరిద్దరి పెళ్లి గురించి తెలుసుకోవాలి.
సందీప్ కుమార్ బీహార్ లోని దర్భంగా అనే జిల్లాకు చెందినవారు. ఇతనికి 2021లో కోర్భా ప్రాంతానికి చెందిన అమ్మాయితో పెళ్లి జరిగింది. వివాహాన్ని తూతూ మంత్రంగా కాకుండా అతని హోదాకు, స్థాయికి ఎక్కడా తగ్గకుండా నిర్వహించారు. యువతి తల్లిదండ్రులు. దాదాపు రూ. కోటి పైన ఖర్చు చేసి బంగారు ఆభరణాలను, నగదును కట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు. ఇలా పెళ్లైన కొద్ది నెలలకే మరింత కట్నం పొందాలనే దురాశ సందీప్ లో కలిగింది. దీంతో పదే పదే కట్టుకున్న భార్యను వేధించడం మొదలు పెట్టాడు. పెళ్లికి ముందు, పెళ్ళి తరువాత వీరిద్దరి ప్రయాణంలో కట్నం తప్ప ప్రేమకు, బంధానికి తావులేకుండా పోయింది.
ఇంతటితో ఆపకుండా తన కర్కషత్వాన్ని మరింత పెంచాడు ఐఏఎస్ అధికారి. తన భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారంలో పాల్గొనేవాడు. ఇలా శారీరకంగా వేధించేవాడని భార్య అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కోర్భా ఎస్పీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఈ యువతికి గద్యంతరం లేక కోర్భా న్యాయంస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో తన ఆవేదనను వ్యక్తపరిచారు. గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారానిక పాల్పడుతున్నాడని కేసు వేసారు. దీనిపై స్పందించిన కోర్ట్ ఐఏఎస్ అధికారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఇలా మహిళలపై వేధింపులు జరిపే వారిని విధుల్లో కొనసాగిస్తుందా.. అసలు ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది. అతని పై ఏమైనా చర్యలు తీసుకుంటుందా.. లేక వేరే ప్రాంతానికి బదిలీ చేస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది.
దేశ అత్యున్నత, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారే ఇలా విచక్షణ కోల్పోతే సగటు మానవునికి ఏమని సందేశం ఇవ్వగలరు. ఇందుకేనా అంతటి గొప్ప చదువును అభ్యసించింది అని పలువురు విమర్శిస్తున్నారు.
T.V.SRIKAR