Exam Results : తెలంగాణ సప్లిమెంటీ ఫలితాలు విడుదల.. ఈ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

Telangana Inter Advanced Supplementary Exam Results Released.
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. మొదటి, రెండోవ సంవత్సరం ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు మే 24 నుంచి జూన్ 3తేదీ 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో సెకండియర్ సప్లిమెంటరీలో 43.77 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఫస్టియర్ సప్లిమెంటరీలో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫలితాల వెబ్ సైట్..
ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, ఇతర వివరాలు నమోదుచేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఇంటర్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా 63.86% ఉత్తీర్ణత నమోదైంది. 70.26% బాలికలు, 58.39% బాలురు పాసయ్యారు. 1,38,477 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగా 43.77% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 47.54%, బాలురు 41.37% మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040 24655027కు కాల్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.