Telangana IPS transfers : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐపీఎస్ ల బదిలీలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన మూడు కమిషనరేట్స్ పరిధిలోని సీపీలను మాత్రమే బదిలీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్స్ లో బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి మార్చారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్ట్ గా సందీప్ శాండిల్యను బదిలీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన రాచకొండ సీపీ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీసుకు ఎటాచ్ చేశారు. సీఎస్ శాంతికుమారి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త ప్రభుత్వంలో తన టీమ్ ను పెట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి మూడు కమిషనరేట్స్ లో సీపీలను బదిలీ చేశారు. ఇతర జిల్లాల ఎస్పీలు, ఇతర శాఖ ఐపీఎస్ లను కూడా ఆయన మార్చే అవకాశముంది.