Telangana Niagara Falls : పాల ధారలా పరవళ్లు తొక్కుతున్న.. తెలంగాణ నయాగార జలపాతం..
తెలంగాణ నయాగరా జలపాతం (Telangana Niagara Falls) .. అందేంటి నయాగరా జలపాతం అమెరికా (America) - కెనడా (Canada) లో ఉంది కదా.. తెలంగాణ అని అంటారే అని అనుకుంటున్నారా..

Telangana Niagara Falls.. Such a Niagara Falls is in America - Canada.. Do you think it is called Telangana..
తెలంగాణ నయాగరా జలపాతం (Telangana Niagara Falls) .. అందేంటి నయాగరా జలపాతం అమెరికా (America) – కెనడా (Canada) లో ఉంది కదా.. తెలంగాణ అని అంటారే అని అనుకుంటున్నారా.. ఆ అమెరికాలో ఉన్న నయాగరా జలపాతంలా అచ్చం తెలంగాణలో కూడా ఉంది అదే మన తెలంగాణ నయాగార వాటర్ వాల్స్.. బొగత జలపాతం. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి లోని బొగత జలపాతానికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతానికి భారీగా నీరు వస్తుండటంతో పాలధారలా.. జల సవ్వడులను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నాలుగు రోజుల అనంతరం బొగత జలపాతం సందర్శన నిన్న తిరిగి ప్రారంభమైంది.
దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు (Tourists) తరలివచ్చి ప్రకృతి అందాలను జలపాతం దృశ్యాలను కళ్లార్పకుండా తీలకిస్తున్నారు. మరోవైపు బోనాల పండుగ (Bonala festival) సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవు దొరకడం తో.. బొగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక యువత అత్యుత్సాహంతో జలపాతంలో దిగి స్నానాలు గానీ.. ఈత కొట్టడం గానీ.. ఫోన్ లో రీల్స్ చేయడం గానీ చేయరదాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.