Kodandaram, Revanth Reddy : కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన తెలంగాణ జన సమితి పార్టీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఉద్యమ నేత టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు, బోసు రాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే కోదండ రామ్ తో భేటీ అయ్యామని చెప్పారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఉద్యమ నేత టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు, బోసు రాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే కోదండ రామ్ తో భేటీ అయ్యామని చెప్పారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి.
2023 ఎన్నికలకు దూరంగా ఉండనున్న టీజేఎస్ పార్టీ..
బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో కాంగ్రెస్ లో కలిసి ముందుకెళ్తామని కోదండ రామ్ వెల్లడించారు. త్వరలోనే ఇరు పార్టీల మధ్య అవహగహన పత్రం విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మా లక్ష్యం పెద్దది.. దాని కోసం కలిసి పని చేస్తానని కోదండరాం తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను, అంతమొందించాలని తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.
కోదండరాం మాట్లాడుతూ.. తమకున్న ఆలోచనలు భవిష్యత్తులో చేయవలసిన కర్తవ్యాలకు సంబంధించిన అభిప్రాయాలను వారితో పంచుకున్నామని చెప్పారు. ‘ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది. సీట్లు ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రైవేటు సైన్యం పై చర్యలు తీసుకుంటాం. టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు హ్యాకర్స్ ను ఉపయోగించి మా ఫోన్ లు హ్యాక్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారు. మేము ఫోన్ లో ప్రైవేట్ గా మాట్లాడుతున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నాను. మమ్మల్ని సంప్రదించిన వారిని బెదిరిస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు ‘నవ తెలంగాణ నిర్మాణం సాధనగానే తాము మద్దతు తెలిపామని చెప్పారు. ఇరు పార్టీల మధ్య ఐక్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని.. ఇందుకు ప్రజలు, ఉద్యమకారులు అందరూ సహకరించాలని కోరారు.
రేవంత్ రెడ్డి..
‘గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారు. ఆయన మద్దతు కాంగ్రెస్ కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చాము. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం ఉంది. భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతాం.. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుంది. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ కు కీలక స్థానం ఉంటుంది. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డికి కోదండరాం హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ కు ఆరు షరతులు పెట్టిన కోదండరాం..
- అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించాలి.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు న్యాయం చేయాలి.
- సంప్రదాయ వృత్తుల వారికీ ఆదాయ భద్రత కల్పించాలి
- చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి.
- రాజ్యాంగ విలువలతో అన్ని వర్గాల వారికీ అభివృద్ధి జరగాలి.
- ఉద్యమ కారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి.
SURESH