Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో సంచలన విషయాలు వెల్లడి.. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ఇదే..
ఫోన్ ట్యాపింగ్ ద్వారానే, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70లక్షలు సీజ్ చేశారు. మునుగోడు ఎన్నికలో కోమటిరెడ్డి డబ్బులు రూ.3.5కోట్లు, దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశారు.

Sensations in the taping remand report...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల నుంచి కోట్ల డబ్బు సీజ్ చేసినట్లు వెల్లడైంది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70లక్షలు సీజ్ చేశారు. మునుగోడు ఎన్నికలో కోమటిరెడ్డి డబ్బులు రూ.3.5కోట్లు, దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశారు.
Pooja Hegde: రెబల్ స్టార్ కరుణించాడు.. లక్కీ పూజా..
హుజూర్ నగర్, మునుగోడు ఉపఎన్నికలకు ముందు పలువురి లావాదేవీలపై నిఘా పెట్టామని రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారు. BRS నేతల ఆదేశాలతో ప్రణీత్ రావుతో కలసి టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్నతో కలిసి ఫోన్ ట్యాపింగ్‌కు టీమ్ ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఏ4గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో మొదట మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావును అరెస్ట్ శారు. ఆయన విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన మరో సీనియర్ అధికారి దయాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
దయాకర్ రెడ్డి సుదీర్ఘకాలంగా ఎస్‌ఐబీలో పనిచేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సన్నిహితుడు. ప్రస్తుతం దయాకర్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలుస్తోంది. ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో కొందరు మాజీ మంత్రుల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో విచారణ కోసం వారికి నోటీసులిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.