Telangana politics : బండ్ల బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ను వదిలేయడమేంటి.. ఎందుకు..

తెలంగాణ రాజకీయాలు (Telangana politics) ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయ్‌. ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akarsh) మొదలుపెట్టిన సీఎం రేవంత్ (CM Revanth Reddy) .. కారు పార్టీని ఖాళీ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారనే చర్చ నడుస్తుండగా.. ఒక హఠాత్‌ పరిణామం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 30, 2024 | 05:30 PMLast Updated on: Jul 30, 2024 | 5:30 PM

Telangana Politics Suddenly Became Interesting Cm Revanth Who Started Operation Akarsh Has Set The Target Of Emptying The Car Party

తెలంగాణ రాజకీయాలు (Telangana politics) ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయ్‌. ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akarsh) మొదలుపెట్టిన సీఎం రేవంత్ (CM Revanth Reddy) .. కారు పార్టీని ఖాళీ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారనే చర్చ నడుస్తుండగా.. ఒక హఠాత్‌ పరిణామం జరిగింది. ఇది రాజకీయాలను మరింత వేడెక్కింది. సరిగ్గా రెండో విడత రుణమాఫీ (Loan waiver) జరుగుతున్న సమయంలో.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (Gadwala MLA Bandla Krishnamohan Reddy) .. బీఆర్ఎస్‌ (BRS) లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బండ్లతో కలిపి మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) .. కాంగ్రెస్‌లో చేరారు. బండ్ల బ్యాక్ టు బీఆర్ఎస్ అనడంతో.. 9మంది ఉన్నారు. వారిలో కూడా మెజారిటీ మంది బీఆర్ఎస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌కు ఝలక్ ఇస్తూ.. తమ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌ వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తంది. ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ గూటికి వస్తారని బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నారు. బండ్ల ఇప్పటికే యూటర్న్‌ తీసుకోగా.. భద్రాచల్లం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా వెనక్కి వచ్చే ప్లాన్‌లో ఉన్నారని టాక్. త్వరలోనే ఈ నలుగురు బీఆర్ఎస్‌లో చేరుతారని చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదులు చేశారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Dana Nagender), స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే (Bhadrachallam MLA) తెల్లం వెంకట్రావుల (Tellam Venkatarao) పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ వచ్చే నెల ఒకటిన ఉంది. దీంతోనే ఈ పరిణామాల జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. పైగా చేరికల విషయంలో రాహుల్‌ను కార్నర్ చేసేలా బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తోంది. ఎవరు పార్టీ మారినా రాజీనామా చేయించి.. పార్టీలో చేర్చుకోవాలనే నిబంధన తెలంగాణలో వర్తించదా అని ప్రశ్నిస్తోంది. ఈ పరిణామాలన్నీ జంపింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఘర్‌వాపసీ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.