తెలంగాణ రెండో అసెంబ్లీ రద్దు – మూడో అసెంబ్లీకి గెజిట్ రిలీజ్ !
తెలంగాణలో మూడో అసెంబ్లీ ఏర్పాటుకు గెజిట్ రిలీజ్ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో గెజిట్ రిలీజ్ చేశారు గవర్నర్ తమిళిసై

Gazette Release : తెలంగాణ రెండో శాసనసభ రద్దు అయినట్లు గవర్నర్ పేరున గెజిట్ రిలీజ్ అయింది. మంత్రి మండలి ప్రతిపాదనతో సభను రద్దు చేసినట్టు గవర్నర్ తమిళిసై ప్రకటించారు. రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయింది. మరోవైపు – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలైన అభ్యర్థుల జాబితాను ఎన్నిక కమిషనర్ వికాస్ రాజ్ గవర్నర్ కు అందించారు. దాంతో రాష్ట్రంలో గెలిచిన 119నియోజకవర్గాల ఎమ్మెల్యేల జాబితాతో గవర్నర్ గెజిట్ రిలీజ్ చేశారు. మూడో శాసన సభకు ఏర్పాటుకు వీలుగా ఈ గెజిట్ రిలీజ్ అయింది.
రెండో శాసన సభ రద్దయినట్టు ప్రకటించడంతో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులంతా మాజీలు అయ్యారు. కేసీఆర్ మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
తెలంగాణ మూడో అసెంబ్లీకి గెలిచిన అభ్యర్థులతో గెజిట్ ఇదే (Click here)