Telangana Anthem : తెలంగాణ గీతాన్ని పాడిన యువ సింగర్స్.. వీళ్లే
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ (Jaya Jayahe Telangana) కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకి రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.

Telangana song was sung by young singer
ఎట్టకేలకు తెలంగాణ కొత్త ప్రభుత్వం అధికార చిహ్నం తో పాటుగా.. తెలంగాణ రాష్ట్రీ గీతం (Telangana State Anthem) “జయ జయహే తెలంగాణ” గీతం కూడా న్యూ వర్షన్ లో జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం రోజున విడుదల కానుంది.
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ (Jaya Jayahe Telangana) కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకి రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే అవకాశం యువసింగర్స్ హారిక నారాయణ్ (Harika Narayan), బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ (Rohit) కు దక్కింది. ఈ గీతానికి సంగీత దర్శకుడు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.
తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని “జయ జయహే తెలంగాణ” గీతం పాటిన కీరవాణి (Keeravani) బృందం కలిసింది. సీఎం తో కలిసిన ఆనందంలో సింగర్ హారిక తెలంగాణ గీతం గురించి ఇలా చెప్పుకొచ్చింది. తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అవకాశం మాకు దక్కినందుకు మాకు ఎంతో సంతోషం.. అలాగే ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం ఓ విశేషం అని చెప్పుకొచ్చారు. చరిత్రలో నిలిచిపోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో మమంల్ని చేర్చినందుకు.. పాడే అవకాశం మాకు ఇచ్చినందుకు కీరవాణి సార్ (Andeshree) కి, అందె శ్రీ కి నా కృతజ్ఞతలు తెలిపింది. మరి కొన్ని గంటల్లో ప్రజలు ఈ గీతాన్ని వినబోతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్స్ సీఎం ను కలిశారు.