KCR: ఊహల్లోంచి రియాలిటీలోకి కేసీఆర్.. సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్
ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్‌కు తగ్గట్టుగా.. తాను కూడా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. ట్విటర్ (ఎక్స్)లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్స్ ఓపెన్ చేశారు. ట్విటర్‌లో అకౌంట్ ఓపెన్ చేయగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు కేసీఆర్.
KCR: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ మార్చారు. ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్‌కు తగ్గట్టుగా.. తాను కూడా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. ట్విటర్ (ఎక్స్)లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్స్ ఓపెన్ చేశారు. ట్విటర్‌లో అకౌంట్ ఓపెన్ చేయగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు కేసీఆర్.
YS JAGAN: ఆనవాళ్లే లేవుగా! బ్యాండేజీ తీసిన జగన్.. కనిపించని గాయం గుర్తులు..
తెలంగాణలో వింత ఘటనలు జరుగుతున్నాయని.. మహబూబ్‌గర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం లేదంటూ పోస్ట్ పెట్టారు. అటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రొఫైల్ ఓపెన్ చేశారు కేసీఆర్. తన ఫొటోను పోస్ట్ చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ కేసీఆర్ సోషల్ మీడియాను పెద్దగా వాడలేదు. తెలంగాణ సీఎంవో ప్రొఫైల్ నుంచే అన్ని అప్‌డేట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నేరుగా రీచ్ అయ్యేందుకు ట్రెండ్‌కు తగ్గట్టుగా కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
కేసీఆర్ అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లో దాదాపు 14 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా గంటగంటకూ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ట్విటర్ (ఎక్స్)లో బీఆర్ఎస్ పార్టీ అఫిషియల్ పార్టీ అకౌంట్‌ను మాత్రమే ఫాలో అవుతున్నారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమ కాలం నాటి ఫొటోను పోస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! pic.twitter.com/X1FxmEugmN
— KCR (@KCRBRSPresident) April 27, 2024