sowmya janu: నన్ను అరెస్ట్ చేయొద్దు.. పోలీసు షర్ట్ చింపిన నటి.. కేసులో కొత్త ట్విస్ట్..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జాగ్వార్ కారు నడుపుతూ.. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా.. అడ్డుకొని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ హోమ్ గార్డుపై దాడికి దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
sowmya janu: టాలీవుడ్ నటి సౌమ్య జాను.. ఈ మధ్య రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జాగ్వార్ కారు నడుపుతూ.. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా.. అడ్డుకొని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ హోమ్ గార్డుపై దాడికి దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు.. సౌమ్య జాన మీద ఐదు చట్టాల కింద కేసులు నమోదు చేసారు.
Poonam Kaur: జగన్‌కు పూనం కౌర్ ప్రశంసలు.. సీఎం జగన్‌ను ఆకాశానికెత్తిన పూనం కౌర్
సౌమ్యని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో సౌమ్య.. హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన కేసులో స్టే ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరింది. ఇక ఈ కేసుని విచారించిన న్యాయస్థానం.. ఆమెను అరెస్ట్ చేయకుండా 41A ప్రొసీడింగ్స్‌తో వెళ్లాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే సౌమ్యకి.. మార్చి 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఐతే సౌమ్య జాను చేసిన రచ్చ.. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఫిబ్రవరి 24న బంజారాహిల్స్ సిగ్నల్ దగ్గర జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్‌లో ప్రయాణించింది సౌమ్య. ఆ టైమ్‌లో అక్కడే ఉన్న ట్రాఫిక్ హోమ్ గార్డు.. ఆమెను అడ్డుకొని ప్రశ్నించారు. దానికి సౌమ్య రియాక్ట్ అవుతూ.. అర్జెంట్ పని ఉన్నప్పుడు రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పేంటి.. పెద్ద సెలెబ్రిటీనే ఇలా అడ్డుకొని గొడవ చేస్తున్నారంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ అర్థంలేని లాజిక్‌లు చెప్తూ వీరంగం చేసింది.
ఆ తర్వాత హోంగార్డుపై దాడికి కూడా దిగింది. అక్కడితో ఆగిపోయిందా అంటే.. ఆ తర్వాత మరింత ఓవరాక్షన్ చేసింది. తన మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు తనని విచారణకు పిలవలేదని.. పిలిస్తే తాను కూడా హోంగార్డు మీద కేసు పెడతానని అంటూ.. మరింత రచ్చ చేసింది.
Telugu actress Sowmya Janu attacked a traffic home guard after she was stopped by the guard for driving her Jaguar car on the wrong side in Banjara Hills, Hyderabad. In the video she is admitting that she was driving in the wrong direction but still she is defending her action. pic.twitter.com/mvov3dSVMr
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) February 27, 2024