J&K.. Elections : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఉద్రిక్తత.. పోలింగ్ బూత్ లో పీడీపీ చీఫ్ ముఫ్తీ నిరసన
జమ్మూ కాశ్మీర్ లో అనంత్ నాగ్ - రాజౌరి లోక్ సభ స్థానం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.
దేశ సార్వత్రిక ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు.. నిరసన కార్యక్రమాలు.. దేశంలో దశల వారిగా లోక్ సభ ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే.. కాగా నేడు జమ్మూ కశ్మీర్ తో పాటుగా దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో.. 1 కేంద్ర పాలిత ప్రాంతంలో 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజాగా జమ్మూ కశ్మీర్ లో మాత్రం ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో అనంత్ నాగ్ – రాజౌరి లోక్ సభ స్థానం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. కాగా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్న పోలింగ్ బూత్ వద్ద రిగ్గింగ్ జరుగుతుందని ఆమె ఆరోపించారు. దీంతో ఆమె పీడీపీ పార్టీ నేతలు.. పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. ఇక పోలింగ్ బూత్ వద్ద ఉన్న పీడీపీ పార్టీ ఏజెంట్లను ఏ కారణం లేకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్భంధిస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీంతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.