BRS MLAs arrested : తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. సీఎం రేవంత్ ముందు సబిత నిరసన వ్యక్తం..
తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly meetings) లో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న బుధవారం కేటీఆర్ (KTR) ప్రసంగిస్తున్న సమయంలో.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ (BRS) మహిళా ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలకు నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చాయి.
తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly meetings) లో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న బుధవారం కేటీఆర్ (KTR) ప్రసంగిస్తున్న సమయంలో.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ (BRS) మహిళా ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలకు నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా (BRS MLAs) నల్ల బ్యాచ్ల అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోవైపు నేడు అసెంబ్లీలో ఎస్సీ (SC, ST) వర్గీకరణపై మాట్లాడడానికి మైక్ ఇస్తామని స్పీకర్ చెప్పుకొచ్చారు. అయిన ప్రధాన ప్రతిపక్షం కి మైక్ ఇవ్వకుండా కావాలనే.. జాప్యం చేస్తున్నారని.. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. సభను ఏక పక్షంగా జరుపుతున్నారంటూ నిరసనకు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు.. మా మహిళ ఎమ్మెల్యేలకు రేవంత్ క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్షల్స్ రంగంలోకి దిగిన… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ఠ్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసు వాహనంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు తరలించారు పోలీసులు. అక్కడి నుంచి BRS ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ కు తీసుకెళ్తున్నారు పోలీసులు. అక్కడే వాళ్లను నిర్భంధించే అవకాశం లేకపోలేదు.. ఇది ఇలా ఉండగా, అసెంబ్లీ ప్రారంభం అయిన దగ్గర నుంచి స్పీకర్ పోడియం ముందు BRS మహిళ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ బైఠాయించి. సీఎం క్షమాపణ చెప్పే వరకు అక్కడ్నుంచి వదలబోమని భీష్మించుకు కూర్చున్నారు.
Suresh SSM