Tesla Cars in India : టెస్లా కారు రూ.20లక్షల లోపే…. ఇండియాలో సేల్స్ కి ఎలాన్ సూపర్ ప్లాన్ !

టెస్లా కార్స్ ఓనర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తొందర్లోనే భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఇండియాలో టెస్లా కార్ ను అనౌన్స్ చేయబోతున్నారు. టెస్లా బ్రాంచ్ ని మా దగ్గర పెట్టాలంటే... మా దగ్గర అంటూ... అన్ని రాష్ట్రాలు ఆహ్వానం పలుకుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎలాన్ మస్క్ కి రిక్వెస్టులు వెళ్ళాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 01:42 PMLast Updated on: Apr 15, 2024 | 1:42 PM

Tesla Car Under Rs 20 Lakhs Elan Super Plan For Sales In India

టెస్లా కార్స్ ఓనర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తొందర్లోనే భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఇండియాలో టెస్లా కార్ ను అనౌన్స్ చేయబోతున్నారు. టెస్లా బ్రాంచ్ ని మా దగ్గర పెట్టాలంటే… మా దగ్గర అంటూ… అన్ని రాష్ట్రాలు ఆహ్వానం పలుకుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎలాన్ మస్క్ కి రిక్వెస్టులు వెళ్ళాయి.

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను కొల్లగొట్టాలంటే చవకైన, తక్కువ రేటులో కారును ఇక్కడికి తీసుకురావాలని టెస్లా CEO ఎలాన్ మస్క్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే 20 లక్షల రూపాయల లోపు కారును మస్క్ ఎనౌన్స్ చేస్తారని అనుకుంటున్నారు. త్వరలోనే ఇండియాకు వస్తున్నట్టు, ప్రధాని మోడీతో భేటీ అవుతున్నట్టు ఎలాన్ మస్క్ ఈమధ్యే ప్రకటించారు. ఇక్కడికి వచ్చాక… ఇండియా మార్కెట్లో టెస్లా కారు గురించి అనౌన్స్ మెంట్ తప్పనిసరిగా ఉంటుందని అనుకుంటున్నారు.

టెస్లా కార్లంటే చాలామందికి క్రేజ్. అందులోనూ మేక్ ఇన్ ఇండియా కారు కావాలని ఎదురు చూస్తున్నారు కూడా. టెస్లాకు ఒక విధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కార్ల ధరలు ఒకేలా ఉంటాయి. మోడల్ 3 బేస్ వేరియంట్ రేటు 40 వేల డాలర్లుగా ఉంది. అంటే మన లెక్కల ప్రకారం 33.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ. అంత హైరేట్ మన మార్కెట్లోకి ఎక్కే ఛాన్స్ తక్కువ. అందుకే టెస్లా మోడల్ లో కొన్ని మార్పులు చేసి…ఇండియన్ రోడ్స్ కి అనుగుణంగా తక్కువ రేటుతో కారును విడుదల చేసే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.

ఇండియాలో టెస్లా తయారీ యూనిట్ ని ప్రారంభిస్తే… ఇంపోర్ట్ ట్యాక్స్ చాలా వరకూ తగ్గిపోతుంది. గ్లోబల్ మార్కెట్ లో ఉన్నన్ని ఫీచర్లు కాకుండా… ఇండియాకు తగ్గట్టుగా కొన్ని ఫీచర్లు తగ్గించవచ్చు. టెస్లా EVలో ఉన్న ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ అనేది ఇక్కడ అనవసరం. అలాగే అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ లెవల్ 2ని చేర్చే అవకాశముంది. ఇలాంటి మార్పులు, చేర్పులతో టెస్లా కారు రేటు భారత్ లో తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది.

టెస్లా ఎలక్ట్రిక్ వెహికిల్స్ బేస్ ప్రైజ్ ని 20 లక్షలతో ప్రారంభిస్తుందని ఆటోమొబైల్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు… ఇతర EV కార్లకు టెస్లా బ్యాటరీలను కూడా ఉత్పత్తి అమ్మడానికి భారత్ లో మార్కెట్ ఉందని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ రేంజ్ లో కాకపోయినా… ఇక్కడ తక్కువ పవర్ తో ఉన్న ఎలక్ట్రిక్ మోటారును కూడా అందించడానికి అవకాశముంది. దాంతో టెస్లా కారు తక్కువ రేటుకే భారతీయులకు లభించే ఛాన్సుంది. మంచి మార్కెట్ ఉన్న భారత్ ను ఎలాన్ మస్క్ వదులుకోడనీ… అందుకే ఇక్కడి మార్కెట్ కు తగ్గట్టుగా రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎలాన్ మస్క్ రాక కోసం టెస్లా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.