Chikoti Praveen Kumar: చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు.. బ్యాంకాక్‌లో అసలేం జరిగింది..
థాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరైంది. 4500 జరిమానా విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది థాయ్‌ల్యాండ్ కోర్టు. అనుమతి లేకుండా పటాయాలో క్యాసినో నిర్వహించడంతో పటాయలో నిన్న చికోటి ప్రవీణ్‌ను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్‌తో పాటు సుమారు 93 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో దాదాపు 83 మంది తెలుగు వాళ్లే ఉండటం సంచలనంగా మారింది.
థాయిల్యాండ్‌కు చెందిన ఓ యువతిని ఆపరేటర్‌గా పెట్టి మొత్త వ్యవహారం నడపించాడనేది చికోటి ప్రవీణ్ మీద ఉన్న ఆరోపణ. పటాయాలోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసి తెలుగు రాష్ట్రాల నుంచి పేకాటరాయుళ్లను బ్యాంకాక్‌కు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి 50 వేల నుంచి లక్ష వరకూ తీసుకున్నట్టు సమాచారం. ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో క్యాసినో గేమ్స్ నిర్వహించాడు ప్రవీణ్. చాలా మంది తెలుగు వాళ్లు ఒకే హోటల్‌లో దిగడం, వాళ్ల యాక్టివిటీస్ అనుమానస్పదంగా ఉండటంలో థాయ్ పోలీసులు హోటల్‌పై రైడ్ చేశారు. క్యాసినో ఆడుతున్న 93 మందిని అరెస్ట్ చేశారు.
నిజానికి బ్యాంకాక్‌లో క్యాసినో లీగల్.. కానీ అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉంది. దీంతో క్యాసినో లాంటి గేమ్స్ అన్నిటినీ ప్రస్తుతం బ్యాన్ చేశారు. కానీ అదే సమయంలో క్యాసినో నిర్వహించారు చికోటి గ్యాంగ్. దీంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. ఇవాళ వాళ్లను కోర్టుకు తరలించడంతో కోర్టు వాళ్లకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రవీణ్ అండ్ కో.. ఇవాళ ఇండియా రానున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రవీణ్ చేప్పే స్టోరీ మొత్తం వేరేగా ఉంది.
తాను క్యాసినో నిర్వహించలేదని.. జస్ట్ ఇన్విటేషన్ వస్తేనే బ్యాంకాక్ వెళ్లానని చెప్తున్నాడు. నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ ఉందంటూ బ్యాంకాక్ నుంచి తనకు ఇన్విటేషన్ వచ్చిందని చెప్పాడు. వాళ్లు పంపిన ఇన్విటేషన్లో స్టాంపులు కూడా ఉండటంతో తాను నమ్మానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ పోకర్ ఇల్లీగల్ అన్న విషయం తనకు తెలియది చెప్తున్నాడు ప్రవీణ్. ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసిన తరువాతనే.. తనకు బెయిల్ మంజూరైందని చెప్తున్నాడు. ఆర్గనైజర్స్ లిస్ట్‌లో తన పేరులేదని చెప్తున్నాడు. తనతో పాటు వచ్చిన తెలుగు వాళ్లతో ఎలాంటి సంబంధం లేదన్నాడు. వాళ్లు గేమ్స్ ఆడాలి అనున్నారు కాబట్టే బ్యాంకాక్ వచ్చారని.. తాను ఎవరినీ ఆర్గనైజ్ చేసి తీసుకువెళ్లలేదని తన వర్షన్ ను వివరించాడు. ఏది ఏమైనా ఈ అరెస్ట్ వ్యవహారంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు చికోటి ప్రవీణ్.