ఆ ఆల్‌రౌండర్‌కు ఫుల్ డిమాండ్ పోటీపడుతున్న 3 ఫ్రాంచైజీలు
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్ కు ఉండే క్రేజే వేరు... అటు బ్యాట్ తో పాటు ఇటు బాల్ తోనూ మ్యాచ్ ను మలుపుతిప్పే ఆల్ రౌండర్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్స్ లో అయితే ఆల్ రౌండర్లు హాట్ కేకులతో సమానం..
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్ కు ఉండే క్రేజే వేరు… అటు బ్యాట్ తో పాటు ఇటు బాల్ తోనూ మ్యాచ్ ను మలుపుతిప్పే ఆల్ రౌండర్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్స్ లో అయితే ఆల్ రౌండర్లు హాట్ కేకులతో సమానం.. వారికుండే డిమాండ్ అంతా ఇంతా కాదు… రెండు విధాలా ఉపయోగపడే ప్లేయర్స్ కోసమే ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తుంటాయి. ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడుతున్న వేళ ఫ్రాంచైజీలు ఈ సారి కూడా ఆల్ రౌండర్లపైనే కన్నేసాయి. తాజాగా వాషింగ్టన్ సుందర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. సుందర్ ఇటీవల న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్‌లోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చెన్నై క్రికెటర్ ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. సుందర్ కోసం మూడు ఫ్రాంచైజీలు తీవ్రంగా ట్రై చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు సుందర్‌పై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావడం, ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉండటం సుందర్ పై ఫ్రాంచైజీల ఆసక్తి పెరిగేందుకు కారణమైంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో గాయం కారణంగా కేవలం 2 మ్యాచ్ లే ఆడాడు. అలాగే జట్టు కూర్పు పరంగా అతనికి చోటు దక్కలేదు. అయినప్పటకీ వాషింగ్టన్ సుందర్ ను సన్ రైజర్స్ వదులుకునే అవకాశం లేదని సమాచారం. వేలంలోకి వదిలేసినా తిరిగి రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా తీసుకునే ఛాన్సుంది. ఒకవేళ కుదరకుంటే మాత్రం గుజరాత్ , ముంబై, చెన్నై ఫ్రాంచైజీలలో ఒక టీమ్ ఖచ్చితంగా అతన్ని దక్కించుకుంటుంది.
ఐపీఎల్ విశ్లేషకుల అంచనా ప్రకారం వాషింగ్టన్ సుందర్ ఈ సారి జాక్ పాట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం 10 కోట్లు పలుకుతాడని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐపీఎల్ కెరీర్ లో సుందర్ 60 మ్యాచ్ లలో 378 పరుగులతో పాటు 37 వికెట్లు పడగొట్టాడు.లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉండడం వాషింగ్టన్ సుందర్ కు డిమాండ్ పెరగడానికి కారణమైంది. ఇదిలా ఉంటే 2022 ఐపీఎల్ ఆక్షన్ లో ఈ ఆల్ రౌండర్ కోసం సన్ రైజర్స్ 8.75 కోట్లు వెచ్చించింది. కాగా, అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటెన్షన్ జాబితాలను సమర్పించడానికి అక్టోబర్ 31 చివరి తేదీాగా నిర్ణయించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ ఈ సారి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్ల శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది.