Ambati Rayudu : వైసీపీకి అందుకే రాజీనామా చేశా.. క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు..
వైసీపీలో అంబటి రాయుడు ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం నుంచి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్న అంబటి రీసెంట్‌గానే అధికారికంగా వైసీపీ కండువా కప్పుడుకున్నాడు. కానీ వారం కూడా తిరగకుండానే పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేస్తున్నాడో ఎలాంటి కారణం చెప్పలేదు. కొంత కాలం రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అనేక చర్చలు తెరమీదకు వచ్చాయి.
వైసీపీలో అంబటి రాయుడు ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం నుంచి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్న అంబటి రీసెంట్‌గానే అధికారికంగా వైసీపీ కండువా కప్పుడుకున్నాడు. కానీ వారం కూడా తిరగకుండానే పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేస్తున్నాడో ఎలాంటి కారణం చెప్పలేదు. కొంత కాలం రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అనేక చర్చలు తెరమీదకు వచ్చాయి. నిజానికి గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అంబటి అనుకున్నాడు. చాలా కాలం నుంచి అక్కడ సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాడు.
రీసెంట్‌గా పార్టీ కండువా కప్పుకున్న తరువాత గుంటూరు ఎంపీ టికెట్ అంబటికే ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడి నుంచి వేరే వ్యక్తిని బరిలోకి దింపబోతున్నట్టు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేశాడు. దీంతో టికెట్ రాకపోవడం కారణంగానే అంబటి పార్టీకి రాజీనామా చేశాడని అంతా అనుకున్నారు. టీడీపీ నేతలైతే.. ఈ విషయంలో వైసీపీ మీద మాటల యుద్ధం చేశారు. చంద్రబాబుతో మొదలుకొని దాదాపు అంతా జగన్‌ను విమర్శించారు. రాయుడిని నమ్మించి మోసం చేశాడని నానా మాటలూ అన్నారు. దీంతో గందరగోళ పరిస్థితికి తెర వేయాలని నిర్ణయించుకున్నాడు రాయుడు. ఎందుకు పార్టీకి రాజీనామా చేశాడో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
త్వరలో ప్రారంభం కాబోతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 క్రికెట్‌లో ఆడుతున్న కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు రాయుడు. త్వరలోనే ఈ గేమ్స్ దుబాయ్‌లో ప్రారంభం కాబోతున్నాయంటూ చెప్పాడు. టీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పాడు. ఇలాంటి లీగ్స్ ఆడుతున్న ప్లేయర్స్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాళ్లై ఉండకూడదు అన్ని రూల్ ఉండటంతోనే తాను వైసీపీ రాజకీమా చేస్తున్నట్టు చెప్పాడు. లీగ్ పూర్తయ్యేవరకూ రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఆ కారణంగానే కొంత కాలం రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్టు పోస్ట్ చేశానని చెప్పాడు. తన పోస్ట్‌ను అంతా తప్పుగా అర్థం చేసుకున్న కారణంగానే ఇప్పుడు వివరణ ఇస్తున్నట్టు చెప్పాడు.