Virat Kohli : కోహ్లీ అందుకే దూరమయ్యాడు.. అసలు విషయం చెప్పిన డివీలియర్స్
ఇంగ్లాండ్(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం కావడంతో పెద్ద చర్చే జరిగింది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించడం, కోహ్లీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వచ్చాయి. అవేమీ నిజం కాదని తెలుస్తోంది. విరాట్ కోహ్లి దూరం కావడానికి గల కారణం వెల్లడైంది.

That's why Kohli left.. De Villiers told the real thing
ఇంగ్లాండ్(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం కావడంతో పెద్ద చర్చే జరిగింది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించడం, కోహ్లీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వచ్చాయి. అవేమీ నిజం కాదని తెలుస్తోంది. విరాట్ కోహ్లి దూరం కావడానికి గల కారణం వెల్లడైంది. సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లి (Virat Kohli) – అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్‌మెషీన్‌కు లేదంటూ కింగ్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు.
కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. తను బాగున్నాడని,కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడని చెప్పుకొచ్చాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని తాను అనుకుంటున్నట్టు చెప్పాడు. చాలా మంది విరాట్ ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమోనని, అది ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నాడు.. విరాట్ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దని సూచించాడు. కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) ను కోహ్లీ 2017లో పెళ్లాడాడు. వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించగా.. రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని డివిలియర్స్ వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడేమో అన్న సందిగ్దానికి తెరపడినట్లయింది.