Chandrababu Babu : చంద్రబాబుకు భారీ ఊరట..! మధ్యంతర బెయిలు మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
తాజాగా స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తిరిగి తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని.. నేడు మంధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

The Andhra Pradesh High Court has granted interim bail to Chandrababu Babu in the recent Skill Development case
స్కిల్ డెవలప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్య మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కు భారీ ఊరట లభించింది. సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్ కేసులో నంద్యాలలో అరెస్టు అయిన చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉన్నారు. తాజాగా స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తిరిగి తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని.. నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇదే స్కిల్ బెయిల్ పై ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆశ్రయించారు.. మధ్యంతర బెయిల్ కు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28న సరెండర్ కావాలని జడ్జి ఆదేశించారు. ఈ మధ్యంతర బెయిల్ లో అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
ఐదు షరతులతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు.
- 1. రూ.లక్ష బెయిల్ బాండ్‍తో పాటు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీలు సమర్పించాలి.
- 2. నచ్చిన హాస్పిటల్‌లో సొంత ఖర్చుతో చికిత్స చేయించుకోవచ్చు.
- 3. చికిత్స, ఆస్పత్రి ఖర్చు వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్‍లో జైలు సూపరింటెండెంట్‍కు సమర్పించాలి.
- 4. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు సాక్షులను ప్రభావితం చేయొద్దు, కేసు గురించి ఎవరితో మాట్లాడొద్దు.
- 5. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి జైలులో లొంగిపోవాలి.