Telangana Congress, CPM : కామ్రేడ్లను బుజ్జగిస్తున్న కాంగ్రెస్..
తెలంగాణ కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించడంతో సీపీఎం నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఈమేరకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేశారు.

The appeasement festival continues in Telangana Congress As the CPM announced that it would contest the elections independently the Congress party started to appease the CPM leaders
తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించడంతో సీపీఎం (CPM) నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఈమేరకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి ( Tammineni Veerabhadram) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫోన్ చేశారు. ఎన్నికల్లో పోటీపై పునరాలోచించి కోవాల్సిందిగా సూచించారు. సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో భట్టి విక్రమార్క సిట్టింగ్ స్థానం మదిర కూడా ఉంది. ఖమ్మంలో కమ్యూనిస్ట్‌ల ప్రభావం ఎక్కువ. దీంతో అక్కడ భారీ స్థాయిలో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు.. కాంగ్రెస్ పోటీ చేస్తున్న చాలా స్థానాల్లో సీపీఎం పోటీకి దిగేందుకు రెడీ అయ్యింది.
Vijayashanti : కాంగ్రెస్ లోకి విజయశాంతి.. ! థర్డ్ లిస్ట్ లో పేరు ఉండే ఛాన్స్ ..!!
ఇప్పటికే 17 మందితో ఫస్ట్ లిస్ట్ కూడా ప్రకటించింది. 14 మంది అభ్యర్థులను ప్రకటించి ముగ్గురు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. మొన్నటి వరకూ కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సీపీఎం రెడీగా ఉంది. కానీ కొత్తగా వస్తున్న నేతల కారణంగా కామ్రేడ్లు కావాలి అనుకున్న సీట్లు మెల్లమెల్లగా చేజారిపోయాయి. పొంగులేటి వల్ల పాలేరు సీటు.. వివేక్ వల్ల చెన్నూరు సీటు పోయింది. ఇక కాంగ్రెస్‌తో సెట్ అవ్వదు అనుకున్న కామ్రేడ్లు వెంటనే స్టేట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.
Telangana BJP : ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య
ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇది అటు తిరగి ఇటు తిరగి బీఆర్‌ఎస్‌కు ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. దీంతో కామ్రేడ్లను బుజ్జగించే పనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. భట్టి సహా కీలక నేతలంతా సీపీఎంతో సంప్రదింపులు జరుపుతున్నారు. పోటీపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ విన్నపానికి సీపీఎం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.