Pooja Hegde : పూజా జాతకం ఇప్పుడైనా మారలేదు..?
పూజా హెగ్డే..టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన బ్యూటీ. ఒకానొక టైం లో క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైతం డేట్స్ ఇవ్వలేనంత బిజీగా గడిపింది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వరుసగా 6 సినిమాలు ప్లాప్ అవ్వడం.. బ్యాడ్ టైం బాదేయడంతో అందివచ్చిన అవకాశాలను కూడా చేజారి పోయాయి.

The beauty was making noise as a lucky heroine in South till recently There was a huge demand for romance with big stars But Pooja Hegdes career went down due to consecutive flops
సౌత్ లో మొన్నటి వరకు లక్కీ హీరోయిన్ గా సందడి చేసింది ఆ బ్యూటీ. బడా స్టార్స్ తో రొమాన్స్ చేయడానికి భారీగా డిమాండ్ చేసేది. కానీ వరుసగా ఫ్లాప్స్ అకౌంట్ లో పడటం తో కెరీర్ డౌన్ అయింది. ఇక తట్ట బుట్ట సదుర్థుకోవడమే లేట్ అనుకుంటున్న టైంలో టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ పట్టేసింది.
పూజా హెగ్డే..టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన బ్యూటీ. ఒకానొక టైం లో క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైతం డేట్స్ ఇవ్వలేనంత బిజీగా గడిపింది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వరుసగా 6 సినిమాలు ప్లాప్ అవ్వడం.. బ్యాడ్ టైం బాదేయడంతో అందివచ్చిన అవకాశాలను కూడా చేజారి పోయాయి. షూటింగ్ మొదలు పెట్టే సమయంలో గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన పూజా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సైలెంట్ గా తప్పుకుంది. దీంతో పూజా హెగ్డే పనైపోయిందని కామెంట్ చేశారు క్రిటిక్స్. కట్ చేస్తే ఒకేసారి రెండు బాలీవుడ్ ఆఫర్స్ ని అకౌంట్ లో వేసుకుంది బుట్టబొమ్మ.
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా మలయాళీ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని ప్లాన్ చేశాడు. దీనికి కోయి షేక్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే కథ కథనం రెడీ అయింది. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయింది. అలాగే ఆయుష్మాన్ ఖురానా, రణవీర్ సింగ్ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ లో పూజా పేరు ఎంపిక చేసినట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇదే నిజమైతే పూజా కెరీర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టే. వన్ నార్త్ లో బుట్ట బొమ్మ క్లిక్ అయితే మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి రావడం కష్టమే.