Lok Sabha Elections : ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నిక మొదలైంది.. సార్వత్రిక సమరం షూరూ..

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. భారత దేశ వ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో ఎన్నికల పండుగ జరగనుంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2024 | 10:01 AMLast Updated on: Apr 19, 2024 | 10:01 AM

The Biggest Election In The World Has Started

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. భారత దేశ వ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో ఎన్నికల పండుగ జరగనుంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు స్వాగతం పలికేందుకు సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అందరూ వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని CEC రాజీవ్ కుమార్ కోరారు.

లోక్ సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. తమిళనాడు, రాజస్థాన్, UP, మధ్య ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్లలో పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపుర్, త్రిపురలోనూ ఎన్నికలు జరగనున్నాయి.

  • రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు :

తొలి విడదతగా మొత్తం 102 లోక్ సభ స్థానాలతో పాటు రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు అయిన అరుణాచల్ ప్రదేశ్ (50), సిక్కిం (42), ఉత్తర ప్రదేశ్ (8),

  • లోక్ సభ స్థానాలు :

తమిళనాడు (39), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయా (2) సహా చెరొక స్థానాలు ఉన్న సిక్కిం, నాగాలాండ్(1), మిజోరంల(1), పశ్చిమ బెంగాల్ (3) మణిపూర్ (2), అస్సాం (5), బిహార్ (4), మహారాష్ట్ర (5), మధ్యప్రదేశ్ 6, జమ్మూకాశ్మీర్ 1 ఇక యూటీలైన అండమాన్ & నికోబార్(1), లక్షద్వీప్, పుదుచ్చేరీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. పోలింగ్ యదావిధంగా సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. ఇవాళ 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

  • తొలి విడతలో అభ్యర్థుల సంఖ్య :

లోక్ సభ ఎన్నికల్లో.. తొలి విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1491 మంది మగవారు, 134 మంది మహిళలున్నారు. వీరిలో 8 మంది కేంద్ర మంత్రులు ఉండగా.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా బరిలో ఉన్నారు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు ఇవాళ ఓటు వేస్తారు. వీరిలో మగవారు 8.4 కోట్లు ఉండగా.. మహిళలు 8.23 కోట్లు ఉన్నారు. తొలిసారి ఓటర్లు 35.67 లక్షల మంది ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే 18 లక్షల మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.

  • సార్వత్రి ఎన్నికల్లో తొలి విడతలో అభ్యర్థు జాబితా :

ఇవాళ్టి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, తమిళి సై సౌందర రాజన్, నబం టుకీ, గౌరవ్ గొగోయ్, జితిన్ మాంఝీ, భూపేంద్ర యాదవ్, నకుల్ నాథ్, అశోక్ కుమార్, సుశీల్ కుమార్ సింగ్, సర్బానంద సోనోవాల్, అర్జు్న్ మేఘవార్, నిసిత్ ప్రామాణిక్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి ఎక్కువగా 77 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందువల్ల ఇవాళ్టి దశను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది.

  • తొలి దశ ఎన్నికల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు :

41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు సుమారు లక్ష వాహనాలను మోహరించారు. మొత్తం 4627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5208 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్లు, 2028 వీడియో సర్వైలెన్స్ టీమ్లు, 1255 వీడియో సర్వైలెన్స్ టీమ్లు ఓటర్లను ఎలాంటి ప్రేరేపితమైనా కఠినంగా, వేగంగా ఎదుర్కోవడానికి 24 గంటలూ నిఘా ఉంచుతున్నాయి. మొత్తం 1374 అంతర్రాష్ట్ర, 162 అంతర్జాతీయ సరిహద్దు పోస్టులు మద్యం, మాదక ద్రవ్యాలు, నగదు, ఉచిత వస్తువుల. అక్రమ తరలింపుపై గట్టి నిఘా ఉంచుతున్నాయి. సముద్ర, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచారు.

SSM