బాక్సింగ్ డే టెస్ట్, భారత్ ఓటమికి కారణాలివే

ఆస్ట్రేలియా టూర్ ను ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియా తర్వాత చేతులెత్తేస్తోంది. అడిలైడ్ లో పుంజుకుని ఆసీస్ స్కోర్ సిరీస్ ను సమం చేస్తే.. తర్వాతి మ్యాచ్ లో భారత్ ఆపసోపాలు పడుతూ ఎలాగోలా డ్రా చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 31, 2024 | 01:08 PMLast Updated on: Dec 31, 2024 | 1:08 PM

The Boxing Day Test The Reasons For Indias Defeat

ఆస్ట్రేలియా టూర్ ను ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియా తర్వాత చేతులెత్తేస్తోంది. అడిలైడ్ లో పుంజుకుని ఆసీస్ స్కోర్ సిరీస్ ను సమం చేస్తే.. తర్వాతి మ్యాచ్ లో భారత్ ఆపసోపాలు పడుతూ ఎలాగోలా డ్రా చేసుకుంది. కానీ మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం మళ్ళీ పాతకథే రిపీటయింది. బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ 184 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ చేసిన తప్పిదాల కారణంగానే భారత్ పరాజయం పాలైంది. నిజానికి ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఓపెనింగ్ కాంబినేషన్ ను డిస్టర్బ్ చేయకుండా వరుసగా 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయినా రోహిత్ బ్యాటింగ్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే నాలుగో టెస్టులో మాత్రం ఓపెనర్ గా రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫామ్ అందుకోలేకపోగా… నిలకడగా ఆడుతున్న కెెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ ను సైతం చెడగొట్టాుయ

నిజానికి రోహిత్ ఫామ్ లో లేకపోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. అయితే తన బ్యాటింగ్ అర్దర్ ని మార్చాల్సిన అవసరం లేకపోయినా రాహుల్ స్థానంలో ఓపెనింగ్ కు వచ్చి మిస్టేక్ చేశాడు. గత మ్యాచ్‌లలో నిలకడగా రాణించిన రాహుల్ బ్యాటింగ్ స్థానం మార్చిన తర్వాత స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని భారీ మిస్టేక్ చేశాడని నెటిజన్లు హిట్ మ్యాన్ పై మండిపడుతున్నారు. మెల్‌బోర్న్ టెస్టులో గిల్‌ను తొలగించి, ఓపెనర్‌గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానానికి పరిమితం చేశాడు. అలాగే గిల్ ను తప్పించడం కూడా ఓటమికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది. ఇక రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌ అతని కెప్టెన్సీపైనా ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ విషయంలో చాలా తడబడ్డాడు. ఒక్కోసారి కోహ్లీని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒకరకంగా ఈ టెస్టులో కోహ్లీ కెప్టెన్సీ చేసి ఉంటె గెలిచేవాళ్లమన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.

బౌలింగ్ మార్పులు చేసే విషయంలోనూ హిట్ మ్యాన్ దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సందర్ లను సరిగ్గా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం బూమ్రా ఒక్కడే వికెట్లు తీస్తుండగా.. అతనిపైనే పూర్తి భారం వేసినట్టు కనిపించింది. అలసిపోయినా కూడా బూమ్రా చేత బౌలింగ్ చేయించడం కూడా రోహిత్ క్లూ లెస్ కెప్టెన్సీకి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిగతంగా వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటగాడైనా కెప్టెన్సీ చేయడంలో ఇబ్బందిపడుతుంటాడు. ప్రస్తుతం రోహిత్ విషయంలోనూ అదే జరిగింది. అందుకే బుమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మొత్తం మీద బ్యాటింగ్ వైఫల్యం, రోహిత్ పేలవ కెప్టెన్సీ, బూమ్రాకు మిగిలిన బౌలర్లు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడంతో మెల్ బోర్న్ లో భారత్ కు ఓటమి తప్పలేదు.