Congress, Kurchi Tata : కాంగ్రెస్‌లో చేరిన కుర్చీ తాత.. ఇక కుర్చీ మడతపెట్టుడే..
కాలా పాషా (Kala Pasha) అలియాస్ కుర్చీ తాత. ఈ పేరు తెలియని వాళ్లు తెలుగు స్టేట్స్‌లో చాలా తక్కువ మంది ఉంటారు. సోషల్ మీడియా (Social Media) వాడే ప్రతీ ఒక్కరికీ కాలా పాషా సుపరిచితుడే. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ (Krishnakanth Park) దగ్గర బిక్షమెత్తుకునే ఇతను.. కుర్చీ మడతపెడతా అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు.
కాలా పాషా (Kala Pasha) అలియాస్ కుర్చీ తాత. ఈ పేరు తెలియని వాళ్లు తెలుగు స్టేట్స్‌లో చాలా తక్కువ మంది ఉంటారు. సోషల్ మీడియా (Social Media) వాడే ప్రతీ ఒక్కరికీ కాలా పాషా సుపరిచితుడే. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ (Krishnakanth Park) దగ్గర బిక్షమెత్తుకునే ఇతను.. కుర్చీ మడతపెడతా అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు. తరువాత ఆ డైలాగ్ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయ్యింది. కొన్ని రోజులకు కాలా పాషా కనిపించకుండా పోయినా.. ఆ డైలాగ్ మాత్రం అలా వాడుకలో ఉండిపోయింది. చివరికి అదే డైలాగ్‌ను రీసెంట్‌గా వచ్చిన గుంటూరు కారం సినిమాలోని ఓ సాంగ్‌లో పెట్టడంతో మరోసారి కుర్చీ తాత (Kurchi Tata) ట్రెండ్ అయ్యాడు. దీంతో చాలా మంది కుర్చీ తాత ఇంటర్వ్యూలు (Internet Viral) కూడా తీసుకున్నారు.
వైజాగ్ సత్య అనే వ్యక్తి కుర్చీ తనను థమన్‌కు పరిచయం చేసి షెల్టర్ ఇచ్చాడని కుర్చీ తాత చాలాసార్లు చెప్పాడు. కానీ రీసెంట్‌గా అదే సత్య కుర్చీ తాత మీద కేస్ పెట్టాడు. తనను ఇష్టం వచ్చినట్టు తిట్టాడని అందుకే కేస్ పెట్టానని చెప్పాడు. దీంతో పోలీసులు కుర్చీ తాతను అరెస్ట్ చేశారు. ఆ వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కానీ అరెస్ట్ ఐన కాసేపటికే కుర్చీ తాతను కొందరు వ్యక్తులు బెయిల్ మీద తీసుకువెళ్లిపోయారు. అయితే కుర్చీ తాత ఎక్కడున్నాడు ఎవరు తీసుకెళ్లారు అని అంతా అనుకున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఉండగానే సడెన్‌గా హైదరాబాద్ గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యాడు కాలా పాషా. అక్కడ అడుక్కోడానికో, పని ఉంటేనో రాలేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు వచ్చాడు.
యూత్ కాంగ్రెస్ కండువా మెడలో వేసుకుని హల్చల్ చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని.. త్వరలోనే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటూ చెప్పాడు. దీంతో తాత మళ్లీ మొదలుపెట్టేశాడు అంటున్నారు నెటిజన్లు. అటు కాంగ్రెస్ ప్రత్యర్థులు కూడా ఈ ఇన్సిడెంట్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు రేవంత్‌కు సరైన జోడీ దొరికాడని.. ఇద్దరూ కలిసి బాగా రాజకీయం చేయండి అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ ఏజ్‌లో ఆ తాత పాలిటిక్స్‌లోకి రావడం ఏంటి. ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి. ఈ రీల్స్ పుణ్యమా అని ఎవరు పడితే వాళ్లే వైరల్ అవుతున్నారు. ఐతే అయ్యారు ఇలాంటి తిక్క పనులు అన్నీ చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలో అంటున్నారు నెటిజన్లు.