CID Petition: పీటీ వారెంట్ అమలు చేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం.?
చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే దారే కనపడటం లేదా.? దీనికి కారణాం ఏంటి..?
చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడంలేదా అంటే అవుననే సమాధానానలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను జైలులోనే ఉంచి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించవల్సిందిగా కోర్టులను కోరేందుకు సిద్దమైంది ఏపీ సీఐడీ. అందులో భాగంగానే అమరావతి రింగురోడ్డు స్కామ్ లో పీటీ వారెంట్ అమలు అమలు చేయవల్సిందిగా పిటీషన్ దాఖలు చేయనుంది.
పీటీ వారెంట్ అంటే..?
- ప్రిజన్ ట్రాన్సిట్ వారెంట్ దీనినే పీటీ వారెంట్ అంటారు.
- నిందితుడు ఒకటి అంతకన్నా ఎక్కువ నేరాల్లో భాగస్వామి అయితే ఈ రకమైన పిటీషన్ కోర్టులో వేస్తారు.
- ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్న వ్యక్తికి తాను చేసిన అన్ని తప్పులకు సంబంధించి రకరకాల కోర్టులకు హాజరు పరచడానికి వేసే వారెంటునే పీటీ వారెంట్ అంటారు.
- దీనిని 40, 41 లా కమిషన్ అధారంగా చేసుకొని సెక్షన్ 267 సీఆర్ పీసీ లో పొందుపరచడం జరిగింది.
పీటీ వారెంట్ చంద్రబాబుకు ఎలా అన్వయం అవుతుంది..?
చంద్రబాబును ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. అయితే ఈ కేసు నిమిత్తం సీఐడీ విచారణ కోరుతూ 5 రోజుల కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. దీనికి చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. అందులో భాగంగానే ఏపీ సీఐడీ మరింత దూకుడు పెంచింది అని చెప్పాలి. ఈ క్రమంలో చంద్రబాబును ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్నవే కాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడిన వాటన్నింటినీ వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ఈ వారెంట్ వేయనున్నట్లు తెలుస్తోంది.
పీటీ వారెంట్ ఆదేశిస్తే బాబు పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం రాజమండ్ర జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం హై కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనికి దీటుగా ఏపీ సీఐడీ అమరావతి రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయిని గుర్తించి దీనిపై పీటీ వారెంటును కోరనుంది. దీనిని ఏసీబీ కోర్టు ఆదేశిస్తే చంద్రబాబుపై మరిన్ని కేసులపై విచారణను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందులో భాగంగా మరిన్ని కోర్టులకు తిరగాల్సి వస్తుంది. ఒక వేళ హై కోర్టులో బెయిల్ మంజూరు చేసే సమయంలో పీటీ వారెంట్ గనుక అమలు అయితే బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తాజాగా ఏపీ సీఐడీ అమరావతి రింగ్ రోడ్డు స్కాంలో పీటీ వారెంట్ కు ఆదేశించవల్సిందిగా కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తున్నారు. దీని వల్ల ఒక కేసు నుంచి మరో కేసుకు లింకు ఉన్నట్లు చూపించేందుకు సీఐడీ ముందుకు వచ్చింది. దీంతో చంద్రబాబు పరిస్థితి ఏంటా అనే ఆసక్తి అందరిలో రోజురోజుకు పెరిగిపోతోంది.
T.V.SRIKAR