Congress Guarantee : మహిళలకు నెలకు 2500 ఎప్పట్నుంచి అంటే..!
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2500 రూపాయలను ఇచ్చే మరో పాపులర్ స్కీమ్ ను తొందర్లోనే ప్రారంభించబోతోంది. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 27న రాష్ట్రంలో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచే రెండు కార్యక్రమాలను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు మరో గ్యారంటీ మహిళలకు నెలకు 2500 రూపాయల స్కీమ్ ను డిసెంబర్ 27నుంచి అమలు చేయబోతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు జరుగుతోంది.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు నెలకు 2500 రూపాయల స్కీమ్ డిసెంబర్ 27 నుంచి ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. 55 యేళ్ళ లోపు మహిళలకు ఈ ఆర్థిక సాయం అందించబోతున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారిని మాత్రమే లబ్దిదారులుగా గుర్తిస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫించన్ పొందని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అంటే వృద్దాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు లాంటి ఫించన్లు రాని కుటుంబంలోని వారికి ముందుగా 2500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర కేబినెట్ బేటీలోఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆ తర్వాత విధి విధానాలను తయారు చేస్తారు.
డిసెంబర్ 27న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోందని హుజూర్ నగర్ లో జరగిన కార్యక్రమంలో ప్రకటించారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 2500రూపాయల పథకంపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఫించన్ల వ్యవహారాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – సెర్ప్ పర్యవేక్షిస్తోంది. మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా ఆ సంస్థకే అప్పగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 86 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళల్లో ఎంతమందిని అర్హులుగా గుర్తిస్తారన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఈ 2500 స్కీమ్ పై గైడ్ లైన్స్ రూపొందించాక.. అప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభింస్తారు. ఇప్పటికే అర్హులైన లక్షల మంది తెల్లరేషన్ కార్డుల కోసం ఎదురు చేస్తున్నారు. అందుకే ఈనెల 28 నుంచి మొదలయ్యే గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు కూడా తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత 2500 స్కీమ్ అమలు చేస్తారా… లేదంటే ముందు ఇప్పటికే వైట్ కార్డులున్న వారికి ఇచ్చి.. తర్వాత కొత్తవారికి ఇస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించనుంది.