Chandrababu Remanded : ఈనెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ పొడగింపు.. జడ్జితో టీడీపీ చీఫ్ ఏమన్నారంటే..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించింది. ఈ నెల 24 వరకు టీడీపీ చీఫ్ రిమాండ్ ను పొడగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు.

The court said that the remand of the TDP chief is being extended till the 24th of this month Lawyers on behalf of CID said
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించింది. ఈ నెల 24 వరకు టీడీపీ చీఫ్ రిమాండ్ ను పొడగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. ఇప్పటికే విచారణ ముగిసి రిమాండ్ ఖైదీగా ఉన్నారని, ఇక కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈక్రమంలో కోర్టులో వాదనలు ఆసక్తికరంగా సాగాయి.
చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. జడ్డి ఎదుట
చంద్రబాబు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మాట్లాడుతూ పలు వివరాలను జడ్జి ఎదుట ప్రస్తావించారు. ‘‘నన్ను అకారణంగా జైల్లో పెట్టారు. నేను అందుకే ఆవేదన చెందుతున్నాను. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు’’ అని కోర్టులో విచారణ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఈవివరాలను నోట్ చేసుకున్నానన్న జడ్జి.. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ‘‘మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. రిమాండ్ ను శిక్షగా భావించొద్దు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం మాత్రమే’’ అని చంద్రబాబుతో జడ్జి పేర్కొన్నారు. ‘‘రిమాండ్ లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా’’ అని ఈ సందర్భంగా చంద్రబాబును జడ్జి అడిగి తెలుసుకున్నారు. ‘‘ఎల్లుండి వరకు మీరు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు’’ అని కూడా చంద్రబాబుతో జడ్జి చెప్పారు.
న్యాయపరమైన చిక్కులు..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను సీఐడీ కస్టడీకి ఇచ్చేలా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడానికి కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. చంద్రబాబుకు రిమాండ్ అంశానికి సంబంధించిన రివ్యూ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. దానిపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఒకవేళ రిమాండ్ ను హైకోర్టు కొట్టేస్తే.. అప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవడం కుదరదు. అందువల్ల హైకోర్టు తీర్పు అనేది కీలకంగా మారుతోంది. అందుకే దిగువ కోర్టు అయిన ఏసీబీ న్యాయస్థానం.. చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించే అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.