డీల్ కుదిరింది ఐలాండ్ కొంటున్న నెయ్ మార్

స్టార్ క్రికెటర్లు, సాకర్ ప్లేయర్స్ , సినిమా సెలబ్రిటీలు లగ్జరీగా నివసించేందుకు భారీ భవంతులను కొంటూనే ఉంటారు. అయితే ఫుట్ బాల్ స్టార్స్ మాత్రం గత కొంతకాలంగా ఏకంగా దీవులనే కొనేస్తున్నారు. తాజాగా బ్రెజిల్ యువ‌కెర‌టం నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ ఓ ఐలాండ్‌ను సొంతం చేసుకోబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2024 | 05:36 PMLast Updated on: Oct 07, 2024 | 5:36 PM

The Deal Is Done Ney Mar Is Buying The Island

స్టార్ క్రికెటర్లు, సాకర్ ప్లేయర్స్ , సినిమా సెలబ్రిటీలు లగ్జరీగా నివసించేందుకు భారీ భవంతులను కొంటూనే ఉంటారు. అయితే ఫుట్ బాల్ స్టార్స్ మాత్రం గత కొంతకాలంగా ఏకంగా దీవులనే కొనేస్తున్నారు. తాజాగా బ్రెజిల్ యువ‌కెర‌టం నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ ఓ ఐలాండ్‌ను సొంతం చేసుకోబోతున్నాడు. రూ.64 కోట్ల‌కు బేరం కుదిరింద‌ని, త్వ‌ర‌లోనే నెయ్‌మ‌ర్ ఆ ఐలాండ్‌లో సేద‌తీర‌నున‌న్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆట ద్వారా కోట్ల రూపాయ‌లు ఆర్జించిన ఇప్పటికే ఎన్నో ఆస్తులు కొన్న నెయ్ మార్ జ‌పావో ఐలాండ్ ను ఖరీదు చేస్తున్నాడు. 6 ఎక‌రాల విస్తీర్ణంలో ఉండే ఈ దీవిలో ఒక ప్ర‌ధాన విల్లా, రెండు మాస్ట‌ర్ సూట్‌లు, స‌ముద్ర‌పు అందాల్ని వీక్షించేందుకు వీలుగా రెండు పెద్ద భ‌వంతులు, హెలీప్యాడ్ ఉన్నాయి.