Rashmi Gautam : నిద్రపోతున్నారా.. పసిబిడ్డను అలా ఎందుకు వదిలేశారు
గతేడాది ఫిబ్రవరిలో అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి మరిచిపోకముందే.. మరో ఘటన వెలుగు చూసింది.

The death of Dutta and Lavanya's five-month-old son in a dog attack is causing a stir.
గతేడాది ఫిబ్రవరిలో అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి మరిచిపోకముందే.. మరో ఘటన వెలుగు చూసింది. కుక్కుల దాడులపై ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ.. వీటి దాడులు ఆగలేదు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు బసవేశ్వర నగర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. దత్త, లావణ్య దంపతుల ఐదు నెలల కుమారుడు కుక్కల దాడిలో మరణించడం కలకలం రేపుతోంది.
తాండూరులోని నాపరాతి పాలిష్ యూనిట్‌లో పనిచేస్తున్నారు దత్త, లావణ్య. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డకు ఎప్పటిలాగే… బాలుడికి స్నానం చేయించి నిద్రపుచ్చిందీ ఆ తల్లి. అయితే తలుపులు వేయకుండా తన పనిలో పడిపోయింది లావణ్య. అంతలోకి ఇంట్లోకి దూరిన కుక్క బాలుడ్ని నోట కరిచింది. దీంతో వెంటనే పరుగెత్తుకుంటు వచ్చిన తల్లిదండ్రులు… కుక్కను చంపేశారు. అయితే అప్పటికే బాబు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఈ ఘటన పై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి అంటుందంటూ ట్వీట్ చేశాడు. ఇక అతగాడి ట్వీట్ కు రష్మీ రియాక్ట్ అయినతీరు వైరల్ గా మారింది.
పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్వవహరించాలంటూ కామెంట్ చేసింది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు. కుక్క దాడి చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారా.. ? చిన్నారి ఏడుపు వారికి వినిపించలేదా.. ? జంతువులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే పేరెంట్స్ కు సంబంధించిన వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. పిల్లల జీవితాలను రిస్క్ లో పెట్టింది ఎవరు ? అదే జంతువుల విషయానికి వస్తే మాత్రం లాజిక్స్ అన్ని మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదు.. ” అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక రష్మిక కామెంట్ కు మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘మీకు బుర్రలేదని అర్థమైంది.. ఇలా ఉంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు ‘ అంటూ కామెంట్ చేయగా.. రష్మిక స్పందించింది. ‘నాకు బుర్రలేదు.. కానీ మీకు ఉంది కదా.. కనడమే కాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లల్ని అలా వదిలేయొద్దు’ అంటూ రియాక్ట్ అయ్యింది.ప్రస్తుతం దీనిపై ట్విట్టర్ వార్ జరుగుతోంది.