REVANTH ON MINISTERS : ఆ ఇద్దరే ఫైనల్..మంత్రుల నోటికి రేవంత్ తాళం
ప్రభుత్వ అంశాలపై ఆ ఇద్దరు మంత్రులు చెప్పిందే ఫైనల్ అంటూ... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ వివాదస్పదంగా మారింది.
ప్రభుత్వ అంశాలపై ఆ ఇద్దరు మంత్రులు చెప్పిందే ఫైనల్ అంటూ… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ వివాదస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై ఆ ఇద్దరు మంత్రులే వెల్లడిస్తారు…. వాళ్ళు చెప్పిందే ఫైనల్ అంటూ … కేబినెట్ మీట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
గతంలో BRS హయాంలో మంత్రులంతా డమ్మీలే అన్న విమర్శలు ఉండేవి. అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ కేటీఆర్ జోక్యం చేసుకునేవారు. స్వతంత్ర్యంగా ఏ మంత్రీ కూడా పాలసీ మేటర్స్ ని బయటకు వెల్లడించేవారు కాదు. రేవంత్ అధికారం చేపట్టాక… మొన్న మొన్నటి దాకా మంత్రులు స్వేచ్ఛగానే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు చెప్పిందే ఫైనల్ అని రేవంత్ తేల్చయడంతో… మిగతా మంత్రులు డైలమాలో పడ్డారు. అంటే మమ్మల్ని డమ్మీలుగా చూపిస్తారా అని ఆగ్రహంగా ఉన్నారు. ఫస్ట్ టైమ్ మినిస్టర్ అయిన పొంగులేటికి అధికారం ఇచ్చి… సీనియర్లయిన మమ్మల్ని పక్కనబెడతారా అని మిగతా మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలు సమిష్టిగా అందరు మంత్రులు తీసుకున్నవే. అలాంటప్పుడు ఆ ఇద్దరికే పవర్స్ ఇవ్వడమేంటనేది రేవంత్ కేబినెట్ లోని మిగతా మంత్రుల ప్రశ్న. 2లక్షల రుణమాఫీపై ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినా… మిగతా మంత్రులు అసహనంతో కనిపించారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ… ఎవరు ఏదైనా మాట్లాడతారన్నది నానుడి…అలాంటిది రేవంత్ తమ నోటికి తాళం వేయడమేంటని మంత్రులు చర్చిస్తున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది.