ఆ నిర్ణయం శ్రేయాస్ దే కోల్‌కతా సీఈవో వ్యాఖ్యలు
ఐపీఎల్ రిటెన్షన్ జాబితా విడుదలైన తర్వాత కొన్ని ఫ్రాంచైజీల నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి. గత సీజన్ లో తమను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ వదిలేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా శ్రేయస్‌ను వదులుకోవడంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ రిటెన్షన్ జాబితాలో అయ్యర్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పాడు. రిటెన్షన్‌లో చాలా విషయాలు ప్రభావం చూపుతాయనీ, రిటెన్షన్ పరస్పర అంగీకారానికి సంబంధించిన్న విషయం చాలా మందికి అర్థం కాదన్నాడు. ఆటగాడు కూడా చాలా విషయాలు పరిగణలోకి తీసుకుని ఒప్పందం చేసుకుంటాడని చెప్పాడు. కొన్ని సార్లు తమ విలువను తెలుసుకోవడానికి ఆటగాళ్లు వేలంలోకి వెళ్తారన్నాడు. కాగా, అయ్యర్‌ను రిలీజ్ చేసిన కేకేఆర్.. రింకు సింగ్, సునీల్ నరైన్, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను రిటైన్ చేసుకుంది.